![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ అంటే ఇప్పుడు తెలియని వారంటూ ఎవరూ ఉండరు.గౌతమ్ కృష్ణ ఏంబిబిఎస్, ఏంబిఏ కూడా చేసాక నటుడిగా మారాడు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన గౌతమ్ కృష్ణ హీరోగా ఆకాశవీధుల్లో, సిద్దూ ది రాక్ స్టార్ వంటి మూవీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్-7లో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు.
అలాంటి గౌతమ్ కృష్ణ రీసెంట్ గా ఒక షోలో ఆడియన్స్ నుంచి ఎదురైన కొన్ని ప్రశ్నలకు వెరైటీ ఆన్సర్స్ ఇచ్చాడు. "మీరు వర్జినా" అని ఒక కుర్రాడు అడిగేసరికి "అంటే ఏంటండీ అన్నాడు కామెడీగా. మళ్ళీ ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ "సల్మాన్ ఖాన్ వర్జిన్ అన్నది ఎంత నిజమో నేను వర్జిన్ అన్నది కూడా అంతే నిజం" అని చెప్పాడు. అలాగే హౌస్ లో ఉన్న తన కో-కంటెస్టెంట్స్ గురించి చెప్పాడు..అమరదీప్ గురించి చెప్తూ "ఏ విషయాన్ని కూడా క్యారీ ఫార్వార్డ్ చేయడు..
కానీ ఎక్కువగా ఎమోషన్ అవుతాడు ...మొదట్లో శోభా శెట్టి అంటే ఒక గయ్యాళి అనుకున్నా కానీ తర్వాత తెలిసింది ఆమెకు కూడా ఒక మనసు ఉందని...పల్లవి ప్రశాంత్ హార్డ్ వర్కర్..బాడ్ థింగ్ ఇంకా చాలా నేర్చుకోవాలి..." అని చెప్పాడు గౌతమ్ కృష్ణ.. మరి హౌస్ లో అందరినీ ఇంత కేరింగ్ చూస్తావ్ కదా మరి బ్రేకప్ ఎందుకయ్యింది అని హోస్ట్ శోభా శెట్టి అడిగేసరికి "కాలేజీలో ఉన్నప్పుడు లవ్ మాది..ఆ విషయం గురించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. అప్పటికి నా వయసు 21 ఏళ్ళు మాత్రమే. ఐతే అప్పటికి నాకు మూవీ ఫీల్డ్ అంటే ప్యాషన్ అని చెప్పాను కానీ నేను ఇంకా అప్పటికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఆ టైంలో ఆ అమ్మాయి కూడా అంత స్టాండ్ తీసుకోలేదు." అని చెప్పాడు గౌతం.
![]() |
![]() |